- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ రంగులు తీసేయండి.. లేదంటే రంగు పడుద్ది
దిశ,వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికల లొల్లి ఏపీలో కాకరేపుతోంది. రూల్స్ పేరిట ప్రభుత్వంపై ఎస్ఈసీ ఆంక్షలు విధిస్తోంది. తాజాగా రేషన్ డోర్ డెలివరీ వాహానాలపై కండీషన్స్ పెట్టింది ఎస్ఈసీ. హైకోర్ట్ ఆదేశాలతో రేషన్ వెహికల్స్ లోపల, భయట చెక్ చేసిన నిమ్మగడ్డ కొన్ని రూల్స్ పాస్ చేశారు. వెహికల్స్ పై ఉన్న రంగుల్ని మార్చాలన్నారు. లేదంటే అనుమతించే ప్రసక్తి లేదంటున్నారు. అంతేకాదు గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ముగిసే వరకు ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అప్పటి వరకు ప్రస్తుతం రేషన్ వాహనాలపై ఉన్న అధికార పార్టీకి చెందిన రంగులతో పాటు సీఎం జగన్, మాజీ దివంగత సీఎం వైఎస్ఆర్ ఫోటోల్ని తొలగించాలని చెప్పింది. రంగులు మార్చిన వాహనాల్ని తమకు చూపించే రేషన్ డోర్ డెలివరీ చేసుకోవచ్చని నిమ్మగడ్డ ప్రభుత్వానికి సూచించారు. అప్పటి వరకు గ్రామాల్లో రేషన్ వాహనాల్ని నిలిపివేస్తామని చెప్పారు. అయితే ఆ ఆదేశాలపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల్ని పాటించాలా లేదంటే మరో ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటూ ప్రభుత్వం పరిశీలిస్తోంది.