- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఒప్పందానికి సెబీ బ్రేక్
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఒప్పందానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ బ్రేక్ వేసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లయిల్ గ్రూపునకు వాటా విక్రయించి రూ. 4 వేల కోట్లను నిధుల సమీకరణ ఒప్పందాన్ని నిలిపేయాలని సెబీ ఆదేశాలిచ్చింది. బుక్ వాల్యూ కంటే తక్కువకు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లను విక్రయిస్తున్నారని సెబీకి ఫిర్యాదు అందింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా ఈ వ్యవహారంపై ఆరా తీసిన నేపథ్యంలో సెబీ తాజా ఆదేశాలపై ఆసక్తి సంతరించుకుంది.
కార్లయిల్ గ్రూప్‌లో డైరెక్టర్‌గా ఉన్న ఆదిత్యపురి హెచ్‌డీఎఫ్‌సీఎ బ్యాంకులో ఉన్నత పదవిలో ఉన్నారు. ఈ ఒప్పందానికి ఆయనే కీలకంగా వ్యవహరించారని, కార్లయిల్ గ్రూప్ ద్వారా రూ. 4 వేల కోట్ల పెట్టుబడితో పాటు ఆయన కీలక పదవిని చేపట్టనున్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ వృద్ధి మరింత వేతవంతం అవుతుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం మదింపు ప్రక్రియను నిర్వహించాలని కంపెనీని సెబీ ఆదేశించింది.