- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యరశ్మితో.. రీయూజబుల్ మాస్క్
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. కరోనా ప్రభావం తగ్గిందని కొన్నిరోజులు మాస్క్‌ను లైట్ తీసుకున్నా, మళ్లీ సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో విధిగా మాస్క్ ధరిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఏదో మొక్కుబడిగా కాటన్ ఫేస్ మాస్క్‌లను వాడుతున్నారు. ఆ తర్వాత వాటిని కాల్చకుండా వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. తద్వారా ఎన్విరాన్‌మెంట్‌కు నష్టం కలగడంతో పాటు వాటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు వినూత్న ఆవిష్కరణకు పూనుకున్నారు. మాస్క్‌ను ఓ గంటసేపు సూర్యరశ్మిలో ఉంచితే, అందులోని సూక్ష్మక్రిములు(వైరస్, బాక్టీరియా) చనిపోయి, దానిని తిరిగి వాడుకునేలా(రీయూజబుల్) రూపొందిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకమైన వస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు.
అమెరికన్ కెమికల్ సొసైటీ (ACS) అప్లైడ్ మెటీరియల్స్, ఇంటర్‌ఫేసెస్ విభాగానికి చెందిన పీక్సిన్ తంగ్, గంగ్ సన్, నితిన్.. వారి సహచరులతో కలిసి ఓ నూతన వస్త్రంతో మాస్క్ తయారు చేశారు. డే లైట్(పగటి పూట కాంతి) లేదా సూర్యరశ్మి తగిలినపుడు.. వస్త్రం రియాక్టివ్ ఆక్సిజన్ కణాలను విడుదల చేసి, మాస్క్ సర్ఫేస్‌పై ఉండే సూక్ష్మక్రిములను చంపేస్తుంది. దీంతో 99.9% సూక్ష్మ్రక్రిములను చనిపోతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మాస్క్‌ను వాష్ చేసుకుని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఈ మాస్కులు ధరించే ఉద్యోగులు.. మధ్యాహ్న భోజనం సమయంలో ఎండ వేడిమికి ఉంచడం ద్వారా వాటి సర్ఫేస్‌పై ఉన్న వైరస్, బ్యాక్టీరియాలు చనిపోతాయి. సూర్యరశ్మితోనే కాకుండా లైట్స్(ట్యూబ్ లైట్స్) వద్ద ఉంచినా, మాస్క్‌పై ఉండే క్రిములు చనిపోయే విధంగా రూపొందించారు. ఈ వస్త్ర తయారీకి శాస్త్రవేత్తలు డైథైలమినో ఎథైల్ క్లోరైడ్ యాసిడ్ ఉపయోగించారు.