- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సముద్రపు అడుగున ఏలియన్స్? మెక్సికోలో గుర్తింపు
దిశ, ఫీచర్స్: మనుషులకు అంతుచిక్కని రహస్యాలెన్నో సముద్ర అంతర్భాగాల్లో నిక్షిప్తమై ఉన్నాయనేది వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీపరంగా సాధిస్తున్న పురోగతి ఇప్పుడిప్పుడే మహాసముద్రాల లోతుకు చేరుకునేందుకు సాయపడుతుండగా.. ఆసక్తికర ఫలితాలు, ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ నీటి అడుగున 14 రకాల లార్వాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’లోని అత్యంత లోతైన ప్రాంతాల్లో నివసించే పలు రకాల జాతులుగా అంచనా వేస్తున్నారు.
రొయ్యలు, ఎండ్రకాయల జాతికి చెందిన ఈ జీవులు ఏలియన్స్(గ్రహాంతరవాసుల) రూపాన్ని కలిగి ఉన్నాయని అధ్యయన సహ రచయితల్లో ఒకరైన హీథర్ బ్రాకెన్-గ్రిస్సోమ్ స్పష్టం చేశారు. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన బ్రాకెన్-గ్రిస్సమ్.. సముద్రంలో కనిపించే రొయ్యలు సాధారణంగా బహుళ లార్వా దశలను ఫాలో అవుతాయని, కానీ కొన్ని జీవులు వివిధ దశల్లోకి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో తమ సీనియర్ సహచరులు కనుగొన్న లార్వాలతో వీటిని సరిపోల్చేందుకు DNA బార్‌కోడింగ్, మోర్ఫాలాజికల్ మెథడ్స్ ఉపయోగించారని పరిశోధకులు జర్నల్ డైవర్సిటీలో ప్రచురించబడిన అధ్యయనంలో వెల్లడించారు. ఇక బ్రాకెన్-గ్రిస్సోమ్.. లోతైన సముద్ర జీవులకు గుర్తింపు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఆమె కనుగొన్న సూక్ష్మ-పరిమాణ జీవులను బహిర్గతం చేయడానికి ఉపయోగించిన జన్యు పద్ధతుల ద్వారానే 2012లోనూ ‘సెరాటాస్పిస్ మోన్‌స్ట్రోసా’ అని పిలువబడే జాతులను గుర్తించగలిగింది. కాగా అనేక జీవులు సముద్రంలోని మెసోపెలాజిక్ జోన్‌లో నివసిస్తున్నాయని చెబుతున్న బ్రాకెన్.. ఈ ప్రాంతం 650 నుంచి 3,200 అడుగుల(200 నుంచి 1,000 మీటర్లు) లోతున ఉంటుందని తెలిపింది. యుక్తవయసు వచ్చిన తర్వాత ఈ జీవులు సముద్ర లోతుల్లో స్థిరపడతాయని ఆమె చెప్పింది.
‘ఈ జాతులకు చెందిన జీవులను చేపలు, డీప్-డైవింగ్ మెరైన్ మమ్ముల్స్, సెఫలోపాడ్స్ వేటాడుతాయి. అంటే వాటి ఫుడ్ చైన్‌కు సంబంధించి ఇవి చాలా ముఖ్యమైనవి’ అని బ్రాకెన్-గ్రిస్సోమ్ అన్నారు. కాగా ఈ 14 జీవుల పేరెంట్స్, లైఫ్ సైకిల్స్‌తో పాటు వాటి అభివృద్ధికి సాయపడే ఎకోలాజికల్ సెటప్ గురించి మరింత తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు తమ అధ్యయనాలను కొనసాగిస్తారని సమాచారం.