- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలి: జగన్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు-నేడు మనబడిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని, స్కూళ్లు తెరిచేనాటికి నాడు-నేడులో చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలన్నారు. ప్రతి స్కూల్ విద్యార్థులను ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ఇందుకోసం నిధులకు కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కాగా, కరోనా కారణంగా మార్చి 22 నుంచి స్కూళ్ల మూతబడిన విషయం తెలిసిందే.
Next Story