విద్యార్థుల్లో ఆనందం పెంచుతున్న జగనన్న వసతి దీవెన

by srinivas |
విద్యార్థుల్లో ఆనందం పెంచుతున్న జగనన్న వసతి దీవెన
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న పథకాలు ప్రజల ఆదరణపొందుతున్నాయి. నవరత్నాల్లో భాగంగా జగనన్న వసతి దీవెన పథకాన్ని నేడు విజయనగరం జిల్లా కేంద్రంగా సీఎం ప్రారంభించనున్నారు. కాసేపట్లో విజయనగరం చేరుకుని బహిరంగ సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

జగనన్న వసతి దీవెన ద్వారా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వసతి, మెస్ ఛార్జీలకింద ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఈ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లో వేస్తే దుర్వినియోగమయ్యే ప్రమాదముండడంతో దీనిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయనున్నారు. అది కూడా రెండు విడతలుగా ఈ ఛార్జీలను ప్రభుత్వం చెల్లించనుంది.

వసతి, మెస్ ఛార్జీల కింద ఏడాదికి ఐటీఐ విద్యార్థులకు పది వేల రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు 20 వేల రూపాయలు అందజేయనున్నారు. అర్హులైన ప్రతి విద్యార్థికి యూనిక్ బార్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ కార్డులను ఈ నెల 25 నుంచి వలంటీర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వాటిని అందజేయనున్నారు. వార్షికాదాయం 2.5 లక్షలు ఉండే కుటుంబాలు ఈ పథకానికి అర్హులు

ఈ పథకంలో భాగంగా తొలి విడతగా ఐటీఐ విద్యార్థలకు ఐదు వేల రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 7,500 రూపాయలు, డిగ్రీ, ఆ పై విద్యార్థులకు పది వేల రూపాయలు వారి తల్లుల అకౌంట్‌లో జమచేయనున్నారు. కాగా, ఏపీలో ప్రస్తుతం 11.87 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు.

Read also..

పోలీసులకు మూడు రోజుల టైం ఇస్తున్నాం : కపిల్ మిశ్రా

Advertisement

Next Story

Most Viewed