గుడ్‌న్యూస్: విద్యార్థులకు రూ. 50,000 స్కాలర్షిప్.. ఇలా దరఖాస్తు చేయండి

by Disha Web Desk 17 |
గుడ్‌న్యూస్: విద్యార్థులకు రూ. 50,000 స్కాలర్షిప్.. ఇలా దరఖాస్తు చేయండి
X

స్కాలర్షిప్: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన వైద్య విద్య చదువుతున్న విద్యార్థులకు ఫిలిప్స్ సంస్థ స్కాలర్షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్షిప్ కింద, ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, బి ఫార్మసీ, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ లేదా ఏదైనా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వారి విద్యా ఖర్చులకు రూ. 50,000 స్కాలర్షిప్ మొత్తాన్ని ఫిలిప్స్ సంస్థ అందిస్తుంది.

అర్హత: విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, బి ఫార్మసీ, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ లేదా ఏదైనా వైద్య విద్యా కోర్సులు చదువుతున్న వారు అర్హులు.

దరఖాస్తు దారులు 12వ తరగతిలో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షలకు మించరాదు.

భారతీయ విద్యార్థులు అయి ఉండాలి.

స్కాలర్షిప్ మొత్తం: ఎంపికైన వారికి రూ. 50,000 స్కాలర్షిప్ గా అందిస్తారు.

కావలసిన డాక్యుమెంట్స్:

ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ప్రూఫ్(ఆధార్/ఓటర్ ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డ్)

ప్రస్తుత ఏడాది అడ్మిషన్ ప్రూఫ్ (రిసిప్ట్/అడ్మిషన్ లెటర్/ఐ.డీ/బోనఫైడ్)

12వ తరగతి మార్క్స్ షీట్.

కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఫార్మ్ 16 ఎ/ఇన్ కమ్ సర్టిఫికెట్/శాలరీ స్లిప్)

దరఖాస్తు దారుని బ్యాంకు డీటెయిల్స్ (క్యాన్సల్డ్ చెక్/పాస్ బుక్ కాపీ)

ఎ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

చివరి తేదీ: జనవరి 31, 2023.

వెబ్‌సైట్: https://www.buddy4study.com



Next Story

Most Viewed