మహా సర్కారుకు సుప్రీంకోర్టులో షాక్

by Shamantha N |
Maharashtra Home Minister Anil Deshmukh
X

న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌తో పాటు ఆ రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనిల్‌పై బాంబే హైకోర్టు ఆదేశించిన సీబీఐ విచారణను నిలిపివేయాలని కోరుతూ ‘మహా’ సర్కారు వేసిన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న నాయకులపై స్వతంత్ర విచారణ జరగాలని కోర్టు అభిప్రాయపడింది. నాలుగు రోజుల క్రితం ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తూ.. బాంబే హైకోర్టు అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీబీఐ బృందం ఒకటి ఇప్పటికే తన పనిని ప్రారంభించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మహారాష్ట్ర సర్కారుకు ఎదురుదెబ్బ వంటిదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story