- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్ బీఐ..మరో మూడు నెలలు మారటోరియం?
దిశ, సెంట్రల్ డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ 4.0ను మే 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మారిటోరియంను మరో మూడు నెలలు పెంచనున్నట్టు తెలుస్తోంది. రుణాలు తిరిగి చెల్లించే అంశంపై తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉందని ఎస్‌బీఐ పరిశోధనలో పేర్కొంది.మార్చి 1, 2020 , మే 31,2020 మధ్య చెల్లించాల్సిన అన్ని టర్మ్ లోన్‌ల చెల్లింపుపై మార్చిలో ఆర్‌బీఐ మూడు నెలల తాత్కాలిక నిషేధానికి అనుమతిచ్చింది. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ మే 31 వరకు పొడిగించడంతో, ఆర్‌బీఐ తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని భావిస్తోంది. తాజా లాక్‌డౌన్ పొడిగింపుతో ఆగస్టు 31 వరకు అన్ని కంపెనీల రుణాల చెల్లింపునకు తాత్కాలిక నిషేధాన్ని సూచించే అవకాశాలున్నాయి. ఆగష్టు తర్వాత సెప్టెంబరులో కంపెనీలు చెల్లించాల్సినవి వడ్డీతో కలిపి చెల్లించే అవకాశం ఇవ్వనుంది. అయితే, వడ్డీతో కలిపి లోన్‌లను తిరిగి చెల్లించడంలో విఫలమైతే, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అలాంటి వారి ఖాతాను నిరర్ధక రుణాలుగా వర్గీకరించే అవకాశాలున్నాయి.