కొరటాల శివతో సత్యదేవ్ సినిమా.. కానీ ఈ సారి..

by Shyam |
కొరటాల శివతో సత్యదేవ్ సినిమా.. కానీ ఈ సారి..
X

దిశ, వెబ్‌డెస్క్: తన ప్రత్యేకమైన నటన శైలితో ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న నటుడు సత్యదేవ్. అందాల భామ చార్మి నటించిన జ్యోతిలక్ష్మితో సినిమాతో పేరుతెచ్చుకున్న సత్యదేవ్ వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నారు. అయితే హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న దర్శకుడు కొరటాల శివ. ఈ దర్శకుడితో సత్యదేవ్ సినిమా చేయబోతున్నారు.

కానీ కొరటాల ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజలు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే సత్యదేవ్ మరో హిట్ కొట్టడం ఖాయమని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం మరింత ఆసక్తి రేపే విషయం.

Advertisement

Next Story