కొన్ని ముఖాలు ప్రశ్నలు లేవనెత్తుతాయి.. సమాధానాలు కాదు.. కొత్త సినిమా అప్డేట్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్!

by Hamsa |
కొన్ని ముఖాలు ప్రశ్నలు లేవనెత్తుతాయి.. సమాధానాలు కాదు.. కొత్త సినిమా అప్డేట్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్!
X

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) 73 ఏళ్లు వచ్చినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఆయన ఏడాదిలో కనీసం నాలుగు చిత్రాల్లో అయినా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక గత ఏడాది భ్రమ యుగ, యాత్ర-2(Yatra 2), ఓజ్లర్ వంటి సినిమాల్లో నటించిన ఆయన హిట్ సాధించలేకపోయారు. ఇక ఈ ఏడాది ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’(Dominic and the Lady's Purse) మూవీతో వచ్చారు. ఇక ఇటీవల ‘బజూకా’ చిత్రంతో వచ్చిన మమ్ముట్టి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నారు కానీ విజయాన్ని సాధించలేకపోయారు. ఇక హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మమ్ముట్టి వరుస చిత్రాల్లో నటిస్తున్నారు.

తాజాగా, మమ్ముట్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొత్త సినిమాను ప్రకటించారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కలం కవల్’. జితిన్ జోస్(Jittin Jose) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని వేఫర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఇప్పటికే విడుదలైనప్పటికీ ఇందులోంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరే అప్డేట్ రాలేదు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ లుక్‌ను రిలీజ్ చేస్తూ మమ్ముట్టి ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. దీనికి ‘‘కొన్ని ముఖాలు ప్రశ్నలు లేవనెత్తుతాయి.. సమాధానాలు కాదు’’ అనే క్యాప్షన్ జత చేశారు.



Next Story