- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిన్న విజయసాయి.. నేడు అంబటి

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వైరస్ బారినపడుతున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మంగళవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. తాజాగా మరో కీలక నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా సోకింది. దీంతో ఆయన వెంటనే హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
కాగా, గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. సత్తెనపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని అంబటి అధికారులను కోరారు.
Next Story