పిసరంత మీరూ తగ్గించొచ్చుగా.. మంత్రి హరీష్ రావుపై పేలుతున్న సెటైర్లు

by Anukaran |   ( Updated:2021-11-13 03:26:58.0  )
పిసరంత మీరూ తగ్గించొచ్చుగా.. మంత్రి హరీష్ రావుపై పేలుతున్న సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెరిగిన పెట్రో ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ పై రూ.5, లీటర్ డీజిల్ పై రూ.10 తగ్గించారు. కేంద్రం నిర్ణయంతో దేశంలోని 24 రాష్ట్రాలు సైతం తమ వంతుగా వ్యాట్‌ను తగ్గించడంతో పెట్రో ధరలు భారీగా తగ్గాయి. అయితే, తెలుగు రాష్ట్రాలు మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆయన రాసిన ఎడిటోరియల్ ఆర్టికల్ ను పంచుకున్నారు. ‘‘ పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత..!’’ అనే శీర్షికతో ఆయన పోస్ట్ చేయగా.. నెటిజన్ల నుంచి కామెంట్ల రూపంలో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో.. ‘‘మనది ధనిక రాష్ట్రమే కదా మనం పెట్రోల్ మీద టాక్స్ ఎందుకు వేయాలి??, 25 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఎందుకు తగ్గించలేదు ? మీరు ₹ 108/- ఉన్న పెట్రోల్ ను ₹ 60/- కి ఇచ్చి బీజేపికి బుద్ది చెప్పండి సారూ..!, కానీ ఆ పిసరంత కూడా తగ్గించలేని దీనస్థితిలో ఉన గరీబ్ తెలంగాణా.. మీ గవర్నమెంట్ ఆ పిసరంత కూడా తగ్గియలేదు కదా.. అగ్గిపెట్టె అరిచేరావు గారు రాసింది చాంతాడంత. నిజాలు గొర్రె తోకంత. పెట్రోల్, డీజిల్ ని జీఎస్టీ లో చేరుస్తాం అంటే ఎందుకు వ్యతిరేకించారు? అంటే జనం సొమ్ము మీరు దొబ్బచ్చు కాని కేంద్రం తీసుకోకూడదా?’’ ఇలాంటి కామెంట్లు వందల కొద్దీ వస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు పెట్రో ధరలపై వ్యాట్‌ను కొంతైనా తగ్గించాలని కోరుతున్నారు. మరిన్ని కామెంట్లు చూసేందుకు ట్వీట్‌లో చూడండి.

Advertisement

Next Story