సీఈవో శశాంక్ కీలక వ్యాఖ్యలు.. ఈవీఎంలను భద్రపరిచేందుకు పటిష్ట ఏర్పాట్లు

by Shyam |
huzurabad by poll
X

దిశ, డైనమిక్ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నడిచింది. సాయంత్రం 7 గంటల వరకు 86.40 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. అయితే, ఇంకా రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓట్ల కౌంటింగ్ కు మరో రెండు రోజులు సమయం ఉండటంతో ఈవీల భద్రతపై దృష్టి పెట్టారు.

ఈ క్రమంలో కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురవ్వకుండా కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులతో స్ట్రాంగ్ రూమ్ ల చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సీఈవో వెల్లడించారు.

Advertisement

Next Story