- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవి ఇబ్బందిగా ఉన్నాయంటూ కలెక్టర్ ని కలిసిన మహిళా సర్పంచ్..
దిశ, ఏపీ బ్యూరో: రోడ్ల దుస్థితిపై ఏకంగా సీఎం జగన్‌కే లేఖ రాసి వార్తల్లో నిలిచిన పి.గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామ సర్పంచ్ బండి మహాలక్ష్మి తన పంచాయతీ అభివృద్ధిపై స్పీడు పెంచారు. ముఖ్యమంత్రి చొరవతో రోడ్లు మరమ్మత్తులు జరిగాయి. తాజాగా సోమవారం కలెక్టరేట్ హరికిరణ్‌ను కలిసిన ఆమె తమ గ్రామానికి చెందిన సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామంలో ఉన్న వైన్ షాప్ ఇబ్బందికరంగా మారిందని, దాన్ని తొలగించాలని కోరారు. అలాగే గ్రామంలో ఉన్న పల్లపు ప్రాంతాలను మెరక చేసి.. డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే శిథిలావస్థకు చేరిన ఎంపీపీ స్కూల్ స్థానంలో కొత్త భవనం నిర్మించాలని.. పాడుబడిన అంగన్‌వాడీ స్కూళ్లను బాగు చేయాలని కోరారు.
కొత్తగా పింఛన్లు మంజూరు అయిన వారికి వెంటనే డబ్బులు మంజూరు చేసేలా చొరవ చూపాలని కోరారు. అలాగే సాంకేతిక సమస్యలు కారణంగా నిలిపోయిన వైఎస్ఆర్ కాపు నేస్తం మరియు వైఎస్ఆర్ చేయూత పథకాలు లబ్ధిదారుల అప్లికేషన్స్‌ను త్వరగా పరిష్కరించి.. లబ్ధిదారులకు డబ్బులు మంజూరు చేసేటట్లు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ హరికిరణ్‌ను కోరారు. వినతి పత్రాలను సంబంధిత అధికారులకు పంపి, సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సర్పంచ్ బండి మహాలక్ష్మికి, కలెక్టర్ హరికిరణ్ హామీ ఇచ్చారు.