కరోనాతో ఇప్పటికీ ప్రమాదమే : వరు

by Shyam |
కరోనాతో ఇప్పటికీ ప్రమాదమే : వరు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్‌కు కరోనా రాగా, హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి చికిత్స తీసుకున్నాడు. ఇటీవలే ఆయన కరోనాను జయించి డిశ్చార్జ్ కాగా, మరో పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని ఆయన కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ సందర్భంగా తన తండ్రికి చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేసింది.

‘మీ అందరి అభిమానానికి, ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాన్న ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మా వెన్నంటి నిలిచిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్, ఫిల్మ్, పొలిటికల్, డాడీ ఫ్యాన్స్, పార్టీ క్యాడర్స్ అందరికీ నా థ్యాంక్స్. మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. దయచేసి అందరూ కూడా సేఫ్‌గా ఉండండి. ఇప్పటికీ కరోనా మనందరికీ ప్రమాదమే. కరోనా అనేది ఎంత డేంజర్ అనే విషయం మనకు ఇప్పుడు అర్థంకాదు కానీ, మన కుటుంబంలో ఎవరికైనా వచ్చినప్పుడు అది ఎంతగా ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది. కరోనాకు భయపడండి, తప్పనిసరిగా మాస్క్ ధరించండి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి. సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడం మరిచిపోకండి’ అంటూ వరలక్ష్మి సూచించింది.

Advertisement

Next Story

Most Viewed