- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆవు లేకపోతే భారత్ కు బంగారు పతకాలు వచ్చేవి కావేమో
దిశ,వెబ్‌డెస్క్: దేశానికి రైతు వెన్నుముక. అలాంటి రైతుకు వెన్నెముక ఆవు. మన పూర్వం రైతుకు భూములు లేకపోయినా ఆవులుండేది. ఆవులు చాలా విషయాల్లో అండదండగా ఉంటాయి. అందుకే రైతు ఆవుల్ని తన ప్రాణంగా చూసుకుంటాడు. సొంత పిల్లల్లా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఆరాధిస్తాడు. అలాంటి ఆవుకు దేశం తరుపున తాను సాధించిన గోల్డ్ మెడల్స్ ను అర్పించాడు ఓ యువకుడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్నఫోటోల్లో యువకుడు తాను సాధించిన బంగారు పతకాల్ని ఆవుకు ఆవిష్కరించి తన ప్రేమను వ్యక్తం చేశాడు.
భారత రెజర్లు రవీందర్ సింగ్, సంజయ, అనిల్ కుమార్ లు కామన్ వెల్త్ గేమ్ లో బంగారు పతకాల్ని సాధించాడు.
అనిల్ 96 కిలోల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన హస్సేన్ షిఫ్కిరిని 6-0తో ఓడించి భారత్ కు బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు.
భారత్ రెజ్లర్ రవీందర్ 60 కిలోల విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్టోఫర్ టెరెన్స్ బాసన్‌ను 7-2 తేడాతో ఓడించి దేశానికి బంగారు పతకాన్ని సాధించాడు. సంజయ్ సింగ్ సైతం 74 కిలోల విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన బ్రియాన్ రిచర్డ్ అడినాల్ 2-0తో విజయం సాధించాడు. సంజయ్ కామన్ వెల్త్ గేమ్ లో 3 బంగారు పతకాల్ని దక్కించుకున్నాడు.
ఇలా భారత్ రెజ్లర్లు తమ అద్భుతమైన ఆటతో దేశానికి పేరు తెచ్చారు. అయితే కామన్ వెల్త్ గేమ్స్ ముగిసిన అనంతరం ఇండియన్ రెజ్లర్ సంజయ్ సింగ్ తాను సాధించిన పతకాల్ని తన ఆవుకు బహుకరించాడు. కామన్ వెల్త్ గేమ్ లో బంగారు పతకాలు సాధించడానికి కారణం తన ఆవేనని సగర్వంగా చెబుతున్నాడు. ఆవు పాలు తాగడం వల్లే ఫిట్ గా ఉండి.., కామన్ వెల్త్ గేమ్ లో రాణించడానికి కారణమైందని తెలిపాడు. ఆవు పాలు తాగకపోయి ఉంటే భారత్ కు బంగారు పతకాలు వచ్చేవి కావేమో’ అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.