రెండో వన్డేలో సంజన.. మరి బుమ్రా ఎక్కడ?

by Shiva |
రెండో వన్డేలో సంజన.. మరి బుమ్రా ఎక్కడ?
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా, స్పోర్ట్స్ ప్రెజెంటేటర్ సంజనా గణేషన్ ఈ నెల మొదటి వారంలో గోవాలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి కోసమని బుమ్రా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ నుంచి లీవ్ తీసుకొని బయటకు వెళ్లాడు. బుమ్రా ఇంకా జట్టుకు దూరంగానే ఉంటుండగా.. సంజన మాత్రం అనూహ్యంగా పూణేలో జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ 2వ వన్డేను హోస్ట్ చేసింది. స్టార్ స్పోర్ట్స్‌లో పని చేసే సంజన.. తిరిగి తన పని ప్రారంభించింది. ఆమెను టీవీ స్క్రీన్ పైన చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు అవాక్కయ్యారు. బుమ్రా టీమ్‌కు దూరం ఉంటుండగా.. సంజనా అప్పుడే పని మొదలు పెట్టిందా? అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంజన వర్క్ చేస్తుంటే.. బుమ్రా ఖాళీగా ఏం చేస్తున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రెజెంటేటర్‌గా పని చేసే సంజన గణేషన్ గతంలో 2019 ప్రపంచ కప్, ఐపీఎల్ 13లకు హోస్ట్‌గా వ్యవహరించింది. రాబోయే ఐపీఎల్ 14వ సీజన్‌ను కూడా ఆమె హోస్ట్ చేసే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story