- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంటర్నేషనల్ సెమినార్‌కు సంగారెడ్డి విద్యార్థినులు

దిశ, మెదక్: అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో కొనసాగుతున్న వేర్చువల్ ఎక్స్చేంజ్ ఫెలోషిప్ ప్రోగ్రాంకు సంగారెడ్డి జిల్లా విద్యార్థినులు ఎంపికయ్యారు. సంగారెడ్డి మునిపల్లి మండల పరిధిలోని బుదేరా గురుకుల మహిళా డిగ్రీ కాలేజీకి చెందిన ఎం.కావ్య, ఎస్.జాఫ్లవి ఈ సెమినార్‌లకు ఎంపికయ్యారు. ఈ నెల 1 నుంచి 16 తేదీ వరకూ శ్రీలంక, బ్రహెయిన్, ఇంగ్లాండ్, ఇండోనేసియా, ఈజిప్ట్ తదితర దేశాల్లో జరుగుతున్న సెమినార్‌కు జూమ్ యాప్ ద్వారా వీడియో డిస్కషన్ నిర్వహిస్తున్నారు. ఈ డిస్కషన్స్‌లో బుదేరాకు చెందిన విద్యార్థినులు వాళ్లకు కేటాయించిన రోజుల్లో డిస్కషన్‌లో పాల్గొననున్నారు. వివిధ దేశాల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు మరో ఏడు ప్రత్యేకతలపై చర్చిస్తారు. విద్యార్థులు సెమినార్‌కు ఎంపిక కావడం పట్ల గురుకుల ప్రిన్సిపాల్ డీవీకే లక్ష్మి హర్షం వ్యక్తం చేసి విద్యార్థినులను అభినందించారు.