నిండుకుండలా 'సంగంబండ’ రిజర్వాయర్‌.. దిగువకు నీటి విడుదల

by Shyam |   ( Updated:2021-09-27 02:32:02.0  )
నిండుకుండలా సంగంబండ’ రిజర్వాయర్‌.. దిగువకు నీటి విడుదల
X

దిశ, మక్తల్: కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సంగంబండ రిజర్వాయర్ మరోసారి నిండుకుండను తలపిస్తోంది. వరద పోటెత్తడంతో ముందు జాగ్రత్తగా సోమవారం పది గంటలకు ప్రాజెక్టు గేటును పైకెత్తి ఐదువందల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారి నాగ శివ తెలిపారు. సంగంబండ ప్రాజెక్టు ఎగువన కర్ణాటక ప్రాంతంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఐదువందల క్యూసెక్యుల వరద నీరు చేరడంతో ప్రాజెక్టు గేటెత్తి దిగువకు ఐదు వందలక్యూసెక్కుల నీటిని పెద్ద వాగులోకి వదిలినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంగంబండ ప్రాజెక్టు నీటి నిల్వ 3.37 టిఎంసి ఉండగా సామర్థ్యం, నీటి నిల్వ 2.49 ఉండాలని అధికారి నాగ శివ తెలిపారు. ఇకపోతే ఈ ఏడాది వర్షాకాలంలో సంగంబండ రిజర్వాయర్ గేట్లను పైకెత్తడం ఇది నాల్గవసారి కావడం విశేషం.

Advertisement

Next Story