తీవ్రంగా శ్రమించాను – సందీప్ శర్మ

by Anukaran |
తీవ్రంగా శ్రమించాను – సందీప్ శర్మ
X

దిశ, వెబ్ డెస్క్: శనివారం రాత్రి షార్జాలో జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సత్తా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అదరగొట్టి.. బెంగళూరుపై ఘన విజయం సాధించింది. దీంతో 7వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఏకంగా 4వ స్థానానికి ఎగబాకింది. కాగా ఈ మ్యాచ్ లో సందీప్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ… నేను బౌలింగ్ మొదలుపెట్టినప్పుడు చాలా తడిగా, బంకగా ఉంది. నకుల్ బాల్స్ వేయడానికి నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాను. కోహ్లీ వంటి గ్రేట్ బ్యాట్స్‌మాన్ వికెట్ పదే పదే తీసినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంటుంది. రానున్న మ్యాచ్‌లో మరింత కష్టపడాల్సి ఉంది అని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed