కామారెడ్డిలోని పెద్దవాగులో ఇసుక మాఫియా

by Sumithra |
కామారెడ్డిలోని పెద్దవాగులో ఇసుక మాఫియా
X

దిశ, ఎల్లారెడ్డి: కామారెడ్డి లింగంపేట్, నాగిరెడ్డిపేట్ శివారులోని పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అక్రమార్కులు రాత్రి, పగలు తేడా లేకుండా ప్రతి రోజు గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరి కొందరైతే డంపింగ్ చేసుకుంటున్నారు. నిరోధించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందాని పలువురు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్ బందోబస్తుల్లో అధికారులు నిమగ్నమయ్యారని.. ఇదే అదునుగా చూసుకొని ఇసుక మాఫియా రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. నిత్యం రాత్రి 10 గంటల నుంచి, ఉదయం 3 గంటల వరకు, ఉదయం 3 నుండి 9 గంటల ఇసుకను తోడేస్తున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమానులు ఇండ్లు నిర్మిస్తున్న వారికి ట్రిప్పు ఇసుక రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు నిఘా ఏర్పాటు చేసి ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed