ఊకచెట్టు వాగులో ఇసుక ఊడ్చేస్తున్నారు !

by Shyam |
ఊకచెట్టు వాగులో ఇసుక ఊడ్చేస్తున్నారు !
X

దిశ, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లా మధనాపురం మండలంలోని దుప్పల్లి ఊకచెట్టు వాగునుంచి కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పలువురు ట్రాక్టర్ యజమానులు ఆరోపిస్తున్నారు. మండలంలో కేవలం ఇరవై ట్రాక్టర్ల ఇసుకను తీసుకుపోవడానికి మాత్రమే అనుమతులుంటే 100 ట్రాక్టర్ల ఇసును తోడుకెళ్తున్నారని వాపోతున్నారు. అధికారులు సరిగా పట్టించుకోకపోవడం వల్లే ఇసుక తరలిస్తున్నారని, దీంతో వాగులో ఇసుక కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకను ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోకుండా ఇష్టానుసారంగా అక్రమంగా రవాణా చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story