- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లాహ్ కోసం పెళ్లి చేసుకున్నాం : సనా ఖాన్
దిశ, వెబ్‌డెస్క్ : కత్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ సనా ఖాన్.. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సినిమాల్లో నటించేందుకు తనను సంప్రదించకూడదని, కేవలం అల్లాహ్ స్మరణలో తన జీవితాన్ని గడుపుతానని.. తన ఆదేశాల ప్రకారం మానవత్వమున్న వ్యక్తిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపింది.
కాగా, సనా ఖాన్ లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మ్యారేజ్ పిక్స్ షేర్ చేసింది. గుజరాత్‌కు చెందిన ముఫ్తీ అనస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. ‘అల్లాహ్ కోసం ఒకరినొకరం ప్రేమించుకున్నాం.. అల్లాహ్ కోసం పెళ్లి చేసుకున్నాం.. అల్లాహ్ ఈ ప్రపంచంలో మమ్మల్ని ఐక్యంగా ఉండనివ్వండి.. మరో జన్మలో మమల్ని తిరిగి కలపండి’ అని కోరుతూ పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ భర్తను పరిచయం చేసింది.
గతంలో మెల్విన్ లోయిస్‌తో రిలేషన్‌లో ఉన్నంత కాలం నరకం అనుభవించినట్టు తెలిపింది. తనతో విడిపోతున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించిన సనా ఖాన్.. ఆ విషబంధం నుంచి దేవుడే విముక్తి కలిగించాడని చెప్పుకొచ్చింది.