- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేర్చుకున్న గుణపాఠం ఇదే సామ్ సంచలన పోస్ట్.. చైతన్య కోసమేనా ?
దిశ, వెబ్‌డెస్క్ : విడాకుల తర్వాత సమంత తన కెరియర్‌పై ఫొకస్ పెట్టి, వరస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే సామ్, విడాకుల తర్వాత సోషల్ మీడియాలో కొన్ని కొటెషన్స్ షేర్ చేస్తూ తన అభిమానులను ఆలోచనలో పడేస్తోంది. విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత సామ్ ఆ బాధ నుంచి బయట పడటానికి తన స్నేహితులతో తీర్థయాత్రలు చేసింది. అంతేకాకుండా విడాకుల ప్రకటన అనంతరం కూడా సామ్ మామ్ సెయిడ్ (అమ్మ చెప్పింది) అంటూ కొటెషన్లు పెట్టింది.
అయితే తాజాగా సామ్ మరో కొటేషన్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఇందులో సమంత జీవితంలో నేర్చుకున్న గుణపాఠం ఇదేనంటూ.. తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనే విషయాన్ని తెలుసుకున్నాను అంటూ తెలిపింది. అంతే కాకుండా చాలా విషయాలు బాగానే ఉంటాయి, కానీ అన్నీ ఉండవు. కొన్నిసార్లు మీరు గట్టి పోరాటం చేసి ఓడిపోతారు. కొన్నిసార్లు మీరు చాలా గట్టి పోరాటం చేసినా, వదిలివేయడం తప్ప వేరే మార్గం లేదని తెలుసుకుంటారు. అంగీకారం అనేది చాలా చిన్నది, వదిలేసేది. అంటూ మరో కొటేషన్ షేర్ చేసింది. దీంతో ఈ కొటేషన్ చూసిన వారందరూ సామ్ ఇంకా విడాకుల బాధ నుంచి సామ్ బయటపడలేదని, ఈ కొటేషన్స్ నాగచైతన్య గురించే పెడుతుందేమోనని నెట్టింట్లో గుసగుసలాడుతున్నారు. మరీ సామ్ ఈ కొటేషన్స్ ఎవరి కోసం, ఎందుకోసం పెట్టిందో తనకే తెలుసు.