- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గార్డెనింగ్ చాలా ఈజీ అంటున్న సామ్
అక్కినేని వారి కోడలు సమంత.. లాక్‌డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకున్న సెలబ్రిటీల్లో ఒకరు. చాలా మంది సెలబ్రిటీలు ఎంటర్‌టైన్మెంట్‌లో బిజీగా ఉంటే, తను మాత్రం గార్డెనింగ్‌లో బిజీ అయిపోయింది. ఇంట్లోనే కూరగాయలు పెంచుతూ ‘గ్రో విత్ మి’ హాష్ ట్యాగ్‌తో మైక్రో గార్డెనింగ్ గురించి తన సోషల్ మీడియా హాండిల్ ద్వారా అభిమానులకు అవగాహన కల్పిస్తోంది సామ్. అంతేకాదు మామ నాగార్జునతో కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన సామ్.. మొక్కలు, పచ్చదనం.. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి తెలిపింది.
కాగా, తాజాగా సామ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లకు ఫన్ ఇస్తూనే మంచి మెసేజ్‌తో కూడిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేసిన ఈ వీడియోలో సామ్.. మొక్కల పెరుగుదల, వాటివల్ల కలిగే లాభం గురించి ఒక్క ముక్కలో చెప్పేసింది. ముందుగా విత్తనాన్ని తీసుకుని చిన్న కుండీలో నాటిన సామ్.. మొక్క పెరిగాక దాన్ని ఆహారంగా తీసుకోవడం వరకు ఒకే వీడియోలో చూపించి శభాష్ అనిపించింది. మొక్కలు నాటడం, దాని ద్వారా వచ్చే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన దిగుబడిని చూస్తే ఎంత అనందంగా ఉంటుందో వీడియో ద్వారా పంచుకుంది. 15 సెకన్ల వీడియోలో మెజీషియన్‌గా మారిన సామ్‌ను చూసి క్యూట్‌గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్న నెటిజన్లు.. గార్డెనింగ్, ఫార్మింగ్, నేచర్ పట్ల సామ్‌కున్న స్పృహకు అప్రిషియేట్ చేస్తున్నారు.