- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థాంక్స్ మామ.. మరిచిపోలేని అనుభవం ఇది : సామ్
దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ తెలుగు ‘సీజన్ 4’లో మామ నాగార్జున తన హోస్టింగ్‌తో ఇరగదీస్తే, కోడలు సమంత అంతకు మించిన ఎనర్జీతో షో హోస్ట్ చేసి శభాష్ అనిపించుకుంది. మామ గారు తన భుజాలపై పెట్టిన బాధ్యతను తన క్యూట్ క్యూట్ మాటలతో నిర్వర్తించి, అందరితో మన్ననలు అందుకుంది. మామ కన్నా కోడలు పిల్ల బాగా చేసిందని, భారీగా డిమాండ్ ఉన్న దసరా మహా ఎపిసోడ్‌ను చాలా బాగా డీల్ చేసిందని కాంప్లిమెంట్స్ సొంతం చేసుకుంది.
దసరా సందర్భంగా ప్రసారమైన ఈ వీకెండ్ ఎపిసోడ్ ఆకట్టుకోగా.. ఇది గుర్తుంచుకోవాల్సిన అనుభవం అని తెలుపుతూ పోస్ట్ పెట్టింది. హోస్ట్‌గా బిగ్ బాస్ వేదికపై ఉంటానని ఎప్పుడూ అనుకోలేదన్న సామ్.. నా మామ గారు ఈ బాధ్యతను ఇచ్చినందున, నాలోని భయాలను అధిగమించి ఈ పని చేశానని తెలిపింది. ‘ఇంతకు ముందు హోస్ట్ చేసిన అనుభవం లేదు.. తెలుగు అంతగా రాదు.. అంతకుముందు కనీసం ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. ఇన్ని భయాలు ఉండి కూడా మామ తన మీద ఉంచిన నమ్మకంతోనే హోస్ట్‌గా బాధ్యత తీసుకున్నాను’ అని తెలిపింది. తన మీద విశ్వాసం ఉంచినందుకు, తనకు హెల్ప్ చేసినందుకు గాను మామకు థాంక్స్ చెప్పింది సామ్. షో తర్వాత ప్రేక్షకుల నుంచి అందుకున్న ప్రశంసలు, ప్రేమకు నిజంగా ధన్యవాదాలు అంటున్న సామ్.. ఆనందంతో గంతులేస్తున్నానని తెలిపింది.