- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా ఫ్రీ సెలూన్.. పీపీఈ కిట్లు ధరించి హేర్ కట్!
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో జిల్లా వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఆ మహమ్మారి బారిన పడుతామో అని చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తమను తాము కాపాడుకోవటమే కాకుండా తమ షాపుకు వచ్చే వారి రక్షణ కోసం సెలూన్ నిర్వాహకులు వినూత్న ఆలోచన చేశారు. వైద్యుల మాదిరిగానే పీపీఈ కిట్లు ధరించి కస్టమర్లకు సేవలందిస్తూ.. వారికి కరోనా నుంచి భరోసా కల్పిస్తున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. సెలూన్ షాపు నిర్వాహకులు పూర్తిస్థాయిలో పీపీఈ కిట్లు ధరించి వినియోగదారులకు హేర్ కట్ చేస్తున్న దృశ్యాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రయత్నం వలన కరోనా వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉండటంతో పాటు.. ప్రజలు సైతం ధైర్యంగా షాపులకు వస్తున్నారని సమాచారం.బిజినెస్ కోసమే కాకుండా ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సెలూన్ షాపు నిర్వాహకులు వెల్లడించారు.