- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాధే’ కోసం థియేటర్లు బుక్ చేసుకోవద్దు : సల్మాన్ ఖాన్
దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పటికీ, ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు.. తన సినిమాను ఈద్ సందర్భంగా రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యాడు సల్మాన్. కానీ పాండమిక్ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని థియేటర్లలోనే ‘రాధే’ ప్రదర్శించబడనుండగా.. మిగతా వారి కోసం గురువారం ‘జీ5’లో రిలీజ్ కానుంది.
ఈ మేరకు వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సల్లూ భాయ్.. అభిమానులు ఎవరూ ప్రైవేట్ స్ర్కీనింగ్స్ కోసం థియేటర్లు బుక్ చేసుకోకూడదని సూచించారు. దాని వల్ల కొవిడ్ బారిన పడే ప్రమాదముందని వారించారు. ‘రాధే’ సినిమా కోసం ఇప్పటికే థియేటర్లు బుక్ చేసుకున్న వారికోసం ఓ మెసేజ్‌ను షేర్ చేశాడు. ‘ఇది మంచి పరిణామం అని అనుకోవడం లేదు, ఈ విధంగా గుంపులుగా వెళ్లి సినిమా చూస్తే వైరస్ స్ర్పెడ్ అవుతుంది. అందుకు నా సినిమా కారణం కాకూడదు. కరోనా సిచ్యువేషన్స్ నుంచి బయటపడేందుకు నేను సాయం చేస్తానే తప్ప, సమస్యను రెట్టింపు చేయాలని చూడను’ అని పేర్కొన్నారు.
ఇక కష్టాల్లో ఉన్నవారి నిస్సహాయతను ఆసరాగా తీసుకొని డబ్బులు సంపాదించేవారంటే తనకు అసహ్యమని సల్మాన్ తెలిపాడు. ప్రస్తుతం ఆక్సిజన్ కోసం చాలా మంది డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇలాంటి విషయాలు నన్ను కలవరపెడతాయని వెల్లడించాడు. అయితే ఎంతో మంది మంచి మనుషులు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో విధాలుగా సాయపడుతున్నారని, వారి డబ్బు ఆపదలో ఉన్నవారికి చేరుతోందని చెప్పుకొచ్పాడు.