ఆర్టీసీ బస్సుల్లో కూరగాయల అమ్మకం

by Anukaran |
ఆర్టీసీ బస్సుల్లో కూరగాయల అమ్మకం
X

దిశ, ఏపీ బ్యూరో: ఆర్టీసీలో కిలోమీటర్లు పూర్తయిన బస్సులను మొబైల్‌ రైతు బజార్లుగా మార్చి నేరుగా గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారుల వద్దకే కూరగాయలు, ఇతర నిత్యావసరాలు తీసుకెళ్లనున్నారు. వీటికి ‘వైఎస్సార్‌ జనతా బజార్లు’గా నామకరణం చేయనున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 52 బస్సులను సంచార రైతు బజార్లుగా మార్చనున్నారు. వీటిని ఆర్టీసీలో ఇంజనీరింగ్‌ అధికారులు రూపొందిస్తున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఆర్టీసీ మొబైల్‌ రైతు బజార్లను నగరాలు, పట్టణాల్లో తిప్పింది. ఈ ప్రయోగానికి వినియోగదారుల నుంచి స్పందన రావడంతో ఆర్టీసీ మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాన్‌ టిక్కెట్‌ రెవెన్యూ కింద ఆర్టీసీ ఆదాయం ఆర్జించేందుకు ఉపకరించడంతో ఆర్టీసీ వైద్య ఆరోగ్య శాఖకు సంజీవని బస్సులు, మార్క్‌ఫెడ్‌కు మొబైల్‌ రైతు బజార్లకు బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది.

Advertisement

Next Story