- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Baahubali మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల
దిశ, ఏపీ బ్యూరో: రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్‌కు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ సైతం వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.
తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ తీరు సినీఇండస్ట్రీ వాళ్లకే నచ్చడం లేదన్నారు. పవన్ ఇండస్ట్రీకి ఒక పెద్ద గుదిబండగా మారారని సినీ పెద్దలే భావిస్తున్నారని విమర్శించారు. పవన్ వల్ల ఇండస్ట్రీకి మేలు జరగకపోగా అసలుకే మోసం వచ్చేలా ఉందని ఇండస్ట్రీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. బాహుబలి మూవీ విషయంలో సగం డబ్బు ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్‌కి రాలేదని విన్నానని అయితే ఆన్‌లైన్ విధానం ద్వారా అప్పటికప్పుడే ఎవరికెళ్లాల్సిన డబ్బు వారికెళ్తుందని దీంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి కాంతారావు వరకు సినిమా ఎవరిదైనా టికెట్ ఒకేలా ఉండేదని గుర్తు చేశారు. కొద్దిమంది చేతిలో ఉన్న వ్యవస్థను సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. సినిమా పెద్దలు ఎప్పుడైనా సీఎంను కలవొచ్చన్నారు. చంద్రబాబులా తాము పిలిచి ఫొటోలు దిగి పబ్లిసిటీ చేసుకునే వాళ్లం కాదంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు.