- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకోసం భారత ప్రభుత్వానికి లంచం?.. ట్రోల్స్ పై సైఫ్
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ 2010లో పద్మశ్రీ అవార్డును కొనుగోలు చేశాడన్న ఆరోపణలపై స్పందించాడు. నటుడు అర్బాజ్ ఖాన్ చాట్ షోలో పాల్గొన్న సైఫ్ ఈ ట్రోల్స్‌పై తనదైన స్టైల్‌లో వివరణ ఇస్తూ.. ‘ఇది సాధ్యం అవుతుందా’ అని ప్రశ్నించాడు. భారత ప్రభుత్వానికి లంచం ఇవ్వడం తనకు కొంచెం మించినదే.. ఆ విషయాన్ని సీనియర్లను అడగాల్సి ఉంటుందని జోక్ చేశాడు. అయినా తను ముందుగా పద్మశ్రీ యాక్సెప్ట్ చేయాలని అనుకోలేదని, ఈ గౌరవం పొందేందుకు తనకన్నా గొప్పనటులు ఇండస్ట్రీలో ఉన్నారని భావించానని తెలిపాడు.
కానీ, తన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ‘భారత ప్రభుత్వాన్ని తిరస్కరించే పొజిషన్‌లో లేవు’ అని’ చెప్పాడని, కాలంతో పాటు ఆ అవార్డు పొందేందుకు అర్హత ఉందని నిరూపిస్తే బాగుంటుందని సూచించాడని చెప్పాడు. ప్రస్తుతం యాక్టింగ్ ఎంజాయ్ చేస్తున్నానని, ప్రజలు తనకు పద్మశ్రీ వచ్చిందని తెలుసుకున్నప్పుడు.. యాక్టర్‌గా తనకు ఆ అర్హత ఉందని అభిప్రాయపడాలనే తపనతో పనిచేస్తున్నానని తెలిపాడు సైఫ్. అంతేకాదు ఈ చాట్ షోలో సైఫ్ కొడుకుకు తైమూర్ అని పేరు ఎందుకు పెట్టారు?, సాక్రిడ్ గేమ్స్‌లో చాన్స్ ఎలా వచ్చింది?, రెస్టారెంట్‌లో గొడవ ఎందుకు జరిగింంది? లాంటి ప్రశ్నలు అడిగారు నెటిజన్లు.