ఖైరతాబాద్‌లో సదర్ సందడి..

by Shyam |
ఖైరతాబాద్‌లో సదర్ సందడి..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్‌లో ఇవాళ (ఆదివారం) సదర్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా యాదవులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉత్సవాల్లో మేలిరకం దున్నపోతులు అందరినీ కనివిందు చేయనున్నాయి. నగరంలో ప్రతియేటా నిర్వహించే ఉత్సవాలకు ఎంతో ఘన చరిత్ర ఉన్నది. కేవలం దున్నపోతులను చూసేందుకే ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలివస్తారనేది కాదనలేని సత్యం.

తెలంగాణ సంప్రదాయ ఉత్సవాల్లో సదర్‌కు కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉత్సవాలను యాదవులు మాత్రమే ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహిస్తుండగా, అన్నివర్గాల ప్రజలు ఇందులో పాలు పంచుకుంటారు. అంతేకాకుండా, వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన దున్నపోతులు ఈ ఉత్సవాల్లో హైలేట్‌ గా నిలవనున్నాయి. కాగా, తొలిరోజు ప్రారంభమయ్యే సదర్ ఉత్సవాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅథితిగా విచ్చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed