- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ వద్దంటున్న రష్యన్‌లు?
‘స్పుత్నిక్ ఫైవ్’ పేరుతో గతవారం కరోనా వ్యాక్సిన్‌ను రష్యా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి రష్యన్లు విముఖత చూపిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. కేవలం 42 శాతం మాత్రమే ఈ వ్యాక్సిన్ ద్వారా వ్యాధి నిరోధకత పొందాలనుకుంటున్నారని, మిగతా 58 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకోవద్దని అనుకుంటున్నట్లు వెల్లడైంది. మరి ఇందుకు కారణమేంటి? ఆ దేశ పరిశోధకుల మీద నమ్మకం లేకనా? లేదా అధ్యక్షుడు పుతిన్ మీద నమ్మకం లేకనా?
ఆగస్టు 11న, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశమే ప్రపంచపు మొట్టమొదటి కొవిడ్ 19 వ్యాక్సిన్ తయారుచేసిందని ప్రకటించారు. మాస్కోలోని ‘గమేలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ, మైక్రోబయాలజీ’ వారు ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. 2021 జనవరి నుంచి ఈ వ్యాక్సిన్ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానుందని వెల్లడించారు. కానీ ముందుగా టీచర్లు, మెడికల్ వర్కర్‌లకే ఇవ్వాలని నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇంత వేగంగా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారుచేయడాన్ని పాశ్చాత్య దేశాలు తప్పుబట్టాయి. ముందు కనిపెట్టామనే పేరు కోసం వ్యాక్సిన్ నాణ్యతను దెబ్బతీసి ఉండొచ్చని, ఇది తీసుకుంటే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోపించాయి. అలాగే పుతిన్ కూతురు వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లుగా విడుదల చేసిన వీడియోను కూడా ఫేక్ అని రుజువులు చూపించే ప్రయత్నం చేశాయి.
రష్యా ప్రభుత్వానికి చెందిన ‘డబ్ల్యూసీఐవోఎం’ అనే సంస్థ ఈ విషయమై ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు వెల్లడయ్యాక పాశ్చాత్య దేశాలు చేసిన తప్పుడు ప్రచారం రష్యన్‌ల మనస్సులో లోతుగా వెళ్లిందని అర్థమైంది. వారు ఆ వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడుతున్నారని, ఆ ఉత్పత్తి మీద నమ్మకం ఏర్పరుచుకోలేకపోతున్న కారణంగా దాన్ని తీసుకోవడానికి ముందుకు రావడం లేదని ఈ సర్వేలో కారణాలు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య, ఆసియా ప్రాంతాల నుంచి బిలియన్ల కొద్దీ డోస్‌లు కోరుతూ దాదాపు 20 దేశాలు ఆర్డర్లు కూడా రిజిస్టర్ చేసుకున్నాయని ‘రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్’ అధినేత కిరిల్ డిమిట్రేవ్ చెప్పడం గమనార్హం. రష్యన్‌లే తమ దేశ ఉత్పత్తిని విశ్వసించడం లేని పక్షంలో ఇతర దేశీయులు ఎందుకు ఇంతలా ఎగబడుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.