- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రుని త్రీడీ పటం తయారుచేయబోతున్న రష్యా
దిశ, వెబ్‌డెస్క్:
భూమి సహజ ఉపగ్రహం చంద్రుని మీద కాస్మోనాట్లు (రష్యన్ వ్యోమగాములు) ఎక్కడ దిగాలనే ప్రదేశాన్ని గుర్తించడానికి మొదటిసారిగా టోపోగ్రఫిక్ త్రీడీ పటాన్ని రష్యా తయారుచేయబోతోంది. స్టీరియో ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబోతున్న ఈ పటంలో రెండు నుంచి మూడు మీటర్ల రెజల్యూషన్ ఉంటుందని రష్యన్ స్పేస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అనటోలీ పెట్రుకోవిచ్ తెలిపారు.
అమెరికన్ శాటిలైట్ల సాయంతో చంద్రుని సమతల ఉపరితల పటాలు ఉన్నప్పటికీ వాటికి కొద్దిగా స్టీరియో ఇమేజింగ్ టెక్నాలజీ జత చేసి మరింత కచ్చితత్వంతో త్రీడీ పటం రూపొందిస్తామని అనటోలి వెల్లడించారు. ఈ పటం సాయంతో చంద్రుని మీద తలాల నిర్మాణాలు, వాటి మూలాలు, అలాగే చంద్రుని మీద భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లకు ఉపయోగపడే సమాచారాన్ని అధ్యయనం చేయవచ్చని అన్నారు. రానున్న దశాబ్ద కాలంలో రష్యా చంద్రుని మీదకి కాస్మోనాట్లను పంపనుంది. అక్టోబర్ 2021లో వారి మొదటి మిషన్ లూనా 25 మొదలుకానుంది.
Tags: Russia, Moon 3d map, cosmonaut, topography, nasa