- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
లాక్‌డౌన్ ఫ్యాట్‌కు రన్నింగ్ మంత్రం!
జీవితాన్ని కరోనాకు ముందు, కరోనా తర్వాత అని విభజించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా.. ముందుగా గమనించాల్సింది మీ శరీరంలో వచ్చిన మార్పుల గురించి. శరీరంలో వచ్చే మార్పులేంటా అని ఆలోచిస్తున్నారా? ఒకసారి కాళ్ల దగ్గర నుంచి పొట్ట వరకు చూసుకోండి. ఏదన్నా మార్పు కనిపిస్తుందా? తెలియకపోతే ఒక్కసారి బరువు చెక్ చేసుకోండి. కనీసం 4 కేజీలు పెరిగి ఉంటారు. అదే మీ శరీరంలో వచ్చిన మార్పు. నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉండి ఎటూ కదలకుండా టీవీ చూస్తూ కనపడిన ప్రతీదీ నోట్లో వేసుకుంటే అలాగే ఉంటుంది మరి. ఇక కరోనా వార్తలు చూసి ఆందోళనలో ఎక్కువ తినేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇక మీరు ఇంటి నుంచి బయటికి రావాల్సిన సమయం వచ్చింది. అలాగని పొద్దాక కాదండోయ్.. పొద్దున్న ఒక గంటసేపు అంతే! ఎందుకంటే..
రన్నింగ్ చేయడానికి. ఇక లావు పెరిగింది చాలు.. రన్నింగ్‌తో కొంతైనా ఫ్యాట్‌ను తగ్గించే ప్రయత్నం చేద్దాం. కరోనా వైరస్ భయం ఇంకా పోలేదు కాబట్టి సిటీలో ఉన్నవారు ఇళ్లలోనే గుండ్రంగా పరిగెత్తుతూ సర్దిపెట్టుకోండి. నిజానికి ఇప్పుడు సిటీలో ఉంటున్నవాళ్లందరూ ఊర్లలోకి వచ్చారు కాబట్టి, ఇక్కడ రన్నింగ్ చేయడంలో వచ్చే మజానే వేరు. సిటీల్లో కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన పార్కుల్లో దొరకని ఆహ్లాదం, అనుభూతి.. పచ్చని పొలాల మధ్య రన్నింగ్ చేస్తుంటే మన సొంతమవుతుంది. ఇలాంటి అనుభూతి పొందేందుకు మీలో ఉన్న రన్నర్‌ను మేల్కొలిపే సమయం వచ్చింది. ఆసక్తి రావడం లేదు, గ్రామాల్లో గరుకు రోడ్ల మీద రన్నింగ్ మా వల్ల కాదు.. అని మాత్రం అనొద్దు. ఒకవేళ అలా అనిపిస్తే ఈ కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి.
ట్రాక్స్, ట్రెడ్‌మిల్స్ గురించి మర్చిపోండి..
సిటీల్లో కావాల్సినంత స్థలం ఉండదు, పార్కుకు వెళ్లేంత తీరిక ఉండదు కాబట్టి.. ఇంట్లోనే ఒక ట్రెడ్‌మిల్ గానీ, అపార్ట్‌మెంట్ పరిధిలో ఒక ట్రాక్ గానీ ఏర్పాటు చేసుకుని రన్నింగ్ చేస్తుంటారు. కానీ ఊర్లలో ఆ అవసరం లేదు. కావాల్సినంత స్థలం ఉంటుంది. అందుకే ట్రాక్స్, ట్రెడ్‌మిల్ కోసం చూడకుండా ప్రకృతి ఒడిలో పరుగెత్తుతూ ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పొందండి.
పరుగెత్తేటపుడు సంగీతం వద్దు..
కొందరికి పరుగెత్తేటపుడు సంగీతం పెట్టుకుంటే గానీ ఆసక్తి రాదు. గట్టి మ్యూజిక్ ఉన్న పాట వస్తే వేగంగా పరుగెత్తడం, నెమ్మదిగా ఉన్న పాట వస్తే స్లోగా పరిగెత్తడం చేస్తుంటారు. గ్రామాల్లో ఇలా చేస్తే కుదరదు. అంటే.. ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉండదని అర్థం. అందుకే వీలైనంతమేరకు హెడ్‌సెట్ పెట్టుకోకపోవడమే మంచిది.
మాస్క్‌తో జాగ్రత్త..
ఇప్పుడు మాస్క్ లేకుండా బయటికి రాకూడదు. కాబట్టి తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి. కానీ రన్నింగ్ చేసేటపుడు మాస్క్ కారణంగా ఆయాసం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విడతల వారీగా రన్నింగ్ చేయడం ఉత్తమం. అంటే కొద్ది దూరం పరుగెత్తి ఒక దగ్గర ఆగి, మాస్క్ తీసి స్వచ్ఛమైన గాలి పీల్చుకుని మళ్లీ మాస్క్ వేసుకుని పరుగెత్తాలి. ఇలా చేస్తే కరోనాను దూరం పెట్టి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.