- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ : MGBS బస్టాండ్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ బుధవారం మహత్మా గాంధీ బస్ స్టేషన్‌లో సాధారణ పౌరుడిలా కనిపించి ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేశాడు. దసరా పండుగ సమయంలో ప్రయాణికులు ఎవరి హడావుడిలో వారు ఉన్నారు. ఈ సమయంలోనే మొహం కనిపించకుండా ఖర్చీఫ్ కట్టుకున్న ఆర్టీసీ ఎండీ ఓ షాప్ దగ్గరకు వెళ్లి అక్కడున్న వస్తువుల ధరలను పరిశీలించారు. ప్యాకెట్ మీద ఉన్న ధర ఎంత.. కస్టమర్లకు ఎంతకు అమ్ముతున్నారని అడిగి తెలుసుకున్నారు.
With respect to complaints related to Exorbitant Prices On top of MRP in #Busstands today I Personally visited to #MGBS in incognito mode to Check MRP Rates in Stalls & Warned All the Stall Owners to abide law. Complain to Depot Managers if you Ppl such things in any busstands pic.twitter.com/SWLv5nq4n6
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 13, 2021
నగరంలోని పెద్ద బస్టాండ్లలోని దుకాణాల్లో ప్రొడక్ట్‌లను MRP ధరల కంటే ఎక్కువకు అమ్ముతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని, అందుకే తాను స్వయంగా పరిశీలించడానికి కస్టమర్ రూపంలో వెళ్లినట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇకమీదట అన్ని బస్టాండ్లలోని దుకాణాల్లో ఎంఆర్పీ కంటే ఎవరైనా ఎక్కువకు ప్రొడక్ట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులు మీకు ఎవరైనా స్టాల్స్‌లో MRP ధరకంటే ఎక్కువకు విక్రయిస్తే డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేయాలని సజ్జన్నార్ తెలిపారు. ఇదిలాఉంటే, ఒక్క ఎంజీబీఎస్‌లోనే కాకుండా రాష్టవ్యాప్తంగా ఉన్న అన్ని స్టాల్స్‌లో నాసిరకం ఉత్పత్తులను, కాలం చెల్లిన ప్రొడక్ట్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నారని కొందరు ఆర్టీసీ ఎండీ ట్విట్టర్ హ్యాండిల్‌కు కామెంట్లు పెడుతున్నారు.
- Tags
- inspection
- mgbs