షాకింగ్: ఆర్టీసీ ఆస్తుల విలువ తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే?

by Anukaran |   ( Updated:2021-09-23 23:35:02.0  )
Bus Bhavan
X

ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.70 వేల కోట్లు ఉంటుందని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోని 11 రీజియన్లలో 1,404 ఎకరాల భూమి ఉన్నదని పేర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్ కన్నా ముందు కేవలం 11 డిపోలు మాత్రమే నష్టాల్లో నడిచాయని తెలిపారు. ప్రస్తుతం మొత్తం డిపోలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని వెల్లడించారు. ఐదు ప్రాంతాల్లోని స్థలాలను పలు బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.1,395 కోట్లను అప్పుగా తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇదేకాక ప్రభుత్వ గ్యారెంటీ కింద రూ. 2,279 కోట్లను రుణంగా తీసుకున్నదని తెలిపారు. కేవలం రూ. 5,600 కోట్ల అప్పును బూచిగా చూపిస్తూ ఆర్టీసీనే అమ్మకానికి పెట్టారని కార్మికులు మండిపడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ ఆస్తులపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థకు రూ. 70 వేల కోట్ల విలువచేసే భూములు, భవనాలున్నాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆర్టీసికి ఉన్న భూములు, భవనాలు, బస్టాండ్లను లెక్కలేశారు. మూడు, నాలుగు నెలల్లో ఆర్టీసీ ఆదాయం గాడిన పడకుంటే ప్రైవేట్​పరం చేస్తామని సీఎం హెచ్చరించినట్లుగా ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​ ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ ఆస్తులపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న రూ. 5,600 కోట్ల అప్పును బూచిగా చూపిస్తూ భూములు అమ్మేస్తారని సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఆస్తులు, అప్పుల వివరాలు ప్రభుత్వానికి అప్పగించడం అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. సంస్థలో మొత్తం కార్మికులు, అధికారులు 49,340 ఉన్నారని టీఎస్​ఆర్టీసీ నివేదిక వెల్లడించింది. కరోనా లాక్​డౌన్​కు ముందు రాష్ట్రంలోని 11 డిపోలు లాభాల్లో ఉండగా.. ఇప్పుడు మిగతా డిపోలు కూడా నష్టాల ఊబిలో కూరుకుపోయాయి.

రూ. 70 వేల కోట్లకు చేరిన విలువ

ప్రభుత్వరంగ సంస్థల్లో విలువైన భూములున్న సంస్థగా ఆర్టీసీ నిలిచింది. ఇటీవల ప్రభుత్వరంగ సంస్థల భూముల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా ఆర్టీసీ ఆస్తుల లెక్కలే తేల్చారు. ఇందులో భాగంగా ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు నివేదికల్లో వెల్లడించారు. జీహెచ్​ఎంసీ పరిధిలోని కీలకమైన ప్రాంతాల్లో ఆస్తులున్నాయి. రాష్ట్రంలో మొత్తం 364 బస్​స్టాండ్లున్నాయి. ఇక 11 రీజియన్లు పరిధిలో మొత్తం 97 డిపోలు, 24 డివిజన్లు, రెండు జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఒక బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండు టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రింటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హకీంపేట ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకాడమీ, స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలు, 14 డిస్పెన్సరీలు, తార్నాక హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్​, ఆర్టీసీ కల్యాణ మండపం, ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముషీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాచిగూడ, చిలకలగూడ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెట్టుగూడ బంగ్లా ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి. ఒక్కో ఉమ్మడి జిల్లాలో వంద ఎకరాలకు పైనే భూములున్నాయి. అత్యధికంగా రంగారెడ్డిలో 250 ఎకరాలు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 194 ఎకరాల ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. వీటి విలువ మొత్తం రూ. 70 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2012–13లో రిజిస్ట్రేషన్​ వాల్యూ ప్రకారం వీటి విలువ రూ. 4,450 కోట్లుగా ఉండగా.. అప్పటి బహిరంగ మార్కెట్​ విలువ రూ. 38 వేల కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. తాజాగా సవరించిన రిజిస్ట్రేషన్​ వాల్యూ ప్రకారం దాదాపు రూ. 12 వేల కోట్ల వరకు ఉంటుందని, బహిరంగ మార్కెట్​లో మాత్రం రూ. 70 వేల కోట్ల పైమాటేనని ఆర్టీసీ తన నివేదికలో పేర్కొన్నది.

ఐదుచోట్ల బ్యాంకు తనఖా కింద భూములు

ఆర్టీసీ ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి రూ. 1,395 కోట్లు అప్పుగా తీసుకున్నది. వీటిని సంస్థ పరిధిలోని ఐదు చోట్ల భూములను తాకట్టు పెట్టింది. మరో రూ. 2,279 కోట్లను ప్రభుత్వ గ్యారంటీ కింద అప్పుగా తీసుకున్నది. వీటిలో ఇటీవల విడుదలైన రూ. 500 కోట్లు కూడా ఉన్నాయి. ఈ రూ. 500 కోట్లను ఇంకా ఖాతాల్లోనే భద్రం పరిచారు. ఎందుకోసం వినియోగించాలనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో నిల్వచేశారు. వీటికి ప్రతినెలా వడ్డీ కడుతున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీల కింద దాదాపు రూ. 2 వేల కోట్లు రావాల్సి ఉంది.

పలు బ్యాంకుల వద్ద తనఖాలో ఉన్న భూములివే..

ప్రాంతం తీసుకున్న అప్పు ( రూ. కోట్లలో) రుణదాత
ఉప్పల్‌ జోనల్‌ వర్క్‌షాప్‌ 175 కెనరాబ్యాంక్‌
జూబ్లీ బస్‌స్టేషన్‌ 650 ఆంధ్రాబ్యాంక్‌
హయత్‌నగర్‌ 1,2 100 ఇండియన్‌బ్యాంక్‌
కరీంనగర్‌ జోనల్‌ వర్క్‌షాప్‌ 425 హడ్కో
బర్కత్‌పురా 45 ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌
మొత్తం 1,395

ఉమ్మడి జిల్లాల వారీగా భూములు (భవనాల సముదాయంతో కలుపుకొని)

జిల్లా విస్తీర్ణం (ఎకరాల్లో)
వరంగల్‌ 118.5
ఖమ్మం 104.83
నల్లగొండ 116.08
కరీంనగర్‌ 194.36
ఆదిలాబాద్‌ 97.52
నిజామాబాద్​ 134.20
హైదరాబాద్‌ 134.09
రంగారెడ్డి 250.72
మహబూబ్‌నగర్‌ 141.72
మెదక్‌ 112.76

మొత్తం 1,404.79

Advertisement

Next Story

Most Viewed