- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth: ఇక మేం ఢిల్లీకి రాబోం.. మోడీనే మా గల్లీకి రావాలె: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కులగణన చేపట్టొద్దంటూ తనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్నా.. ఆ పని చేశామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ ఢిల్లీ (Delhi)లోని జంతర్‌మంతర్ (Janthar Manthar) వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన బీసీ సంఘాలు ధర్నాకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్క తేలాలన్నారు. అదేవిధంగా రిజర్వేషన్ల అంశాన్ని రాహుల్ గాంధీ (Rahul Gandhi) దృష్టి తీసుకొచ్చామని అన్నారు. జనాభా తెలియకపోతే రిజర్వేషన్లు ఇచ్చేందుకు లేదని కోర్టులే చెప్పాయని తెలిపారు. దీంతో జనగణనతో పాటు కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని అన్నారు.
బీజేపీ కమండల్ యాత్ర
దామాషా ప్రకారం నిధులు, నియామకాలు, చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. బలహీనవర్గాల లెక్క తేల్చాలని మొరార్జీ దేశయ్ మండలి కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 52 శాతం బలహీనవర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మండలి కమిషన్ ఆనాడే చెప్పిందన్నారు. అయితే, బీజేపీ కుట్ర చేసి మండలి కమిషన్‌కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేపట్టిందని గుర్తు చేశారు. బీసీల గొంత వినిపించేందుకే ఢిల్లీ (Delhi)లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. అసైన్డ్ చట్ట ద్వారా భూస్వాముల స్థలాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ (Congress) ఇచ్చిందన్నారు. బీసీలను బలపరిచే ఆలోచనకు బీజేపీ (BJP) పూర్తి వ్యతిరేకమని అన్నారు.
ధర్మయుద్ధం చేస్తాం..
బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందని 2021లో జనాభా లెక్కలను వాయిదా వేశారని ఆరోపించారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో బలహీనవర్గాల లెక్క 56.36 శాతంగా తేల్చామని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేయలేదని సెటైర్లు వేశారు. రిజర్వేషన్లు పెంచడం కేంద్ర పరిధిలోని అంశమని.. ఆ విషయంపై బీజేపీ నేతలు స్పందించడం లేదని అన్నారు. అందుకే తాము ఢిల్లీలో ధర్నా చేపట్టాల్సి వచ్చిందన్నారు. తమకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుతిస్తే.. 10 లక్షల మందితో సభ పెట్టి మోడీని సన్మానిస్తామని కామెంట్ చేశారు. దేశంలో రిజర్వేషన్లు పెంచుతారో లేదో ప్రధాని ఇష్టమని.. కానీ, తెలంగాణ రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసమే ఢిల్లీ (Delhi)కి వచ్చామని.. అయితే, ఈ విషయంపై ఇక ఢిల్లీకి రాబోమని అన్నారు. గల్లీలోనే పోరాటం చేస్తామని అన్నారు. 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్‌లో ధర్మయుద్ధం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.