RT-PCR టెస్టులపై కేజ్రీవాల్ కీలక నిర్ణయం

by sudharani |
RT-PCR టెస్టులపై కేజ్రీవాల్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నందున ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. RT-PCR టెస్టుల ధరలను తగ్గిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఇదివరకు ప్రభుత్వ, ప్రైవేటు లాబ్స్‌లో కలెక్ట్ చేస్తున్నటెస్టుల ధర రూ.2400 నుంచి 800కు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి వెళ్లి సర్వీసు అందించే వారు మాత్రం రూ.1200 వరకు చార్జ్ చేయొచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు. అంతేకాకుండా టెస్టులకు సంబంధించిన ఫలితాలను 24 గంటల వ్యవధిలో వైద్య ఆరోగ్యశాఖ వైబ్ సైట్‌లో పొందుపరచాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed