- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోనాల ఉత్సవాలకు రూ.60 కోట్లు కేటాయింపు : మంత్రి తలసాని
దిశ ప్రతినిధి , హైదరాబాద్: బోనాల పండగను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయాల అలంకరణ, పూజల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లను మంజూరు చేస్తుందని, ఏర్పాట్ల కోసం రూ.60 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.
బోనాల ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని 3 లక్షల మందికి సరిపడా మాస్క్ లు, శానిటైజర్లను తానూ వ్యక్తిగతంగా అందజేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ప్రతి ఆలయం వద్ద ఖచ్చితంగా శానిటైజర్లను అందుబాటులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఆలయాల వద్ద మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మొబైల్ టెస్టింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగలను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని హోంమంత్రి మహమూద్ అలీ , కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలు అన్నారు. పండుగల కోసం నిధులు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలు కూడా సహకరించాలని కోరారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆషాడ బోనాలకు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. బోనాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ లు ప్రభాకర్, సురభి వాణిదేవి, ఎమ్మెల్యే లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, సాయన్న, సుబాష్ రెడ్డి, రాజసింగ్ తదితరులు పాల్గొన్నారు.