- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు రూ.5కోట్ల ఆర్థికసాయం
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ద్వారా రూ.5 కోట్ల 15 లక్షలు ఆర్థిక సాయంగా అందించినట్లు సంస్థ చైర్మన్ అల్లం నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కొవిడ్ బారిన పడిన జర్నలిస్టులను ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ద్వారా ఆదుకుందని ఆయన తెలిపారు.
తొలి విడత కరోనా సమయంలో దాదాపు 1553 మంది కరోనా సోకిన జర్నలిస్టులకు రూ.3 కోట్ల 10 లక్షల 60 వేల రూపాయలను అందించినట్లు చెప్పారు. కరోనాతో హోంక్వారంటైన్ లో ఉన్న జర్నలిస్టులకు 87 మందికి రూ.8.70 లక్షలు ఆర్థికసాయం అందించామన్నారు. రెండో విడతలో దాదాపు 1958 మంది జర్నలిస్టులకు కరోనా సోకిందని, అయితే ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున 1958 మంది జర్నలిస్టులకి రూ.కోటి 95 లక్షల 80 వేలు ఆర్థికసాయం అందించినట్లు పేర్కొన్నారు.
మీడియా అకాడమీలో ఉన్న రూ.34 కోట్ల 50 లక్షల కార్పస్ ఫండ్ తో వచ్చిన వడ్డీ ఆధారంగా జర్నలిస్టులను ఆదుకున్నట్లు ఆయన చెప్పారు. కరోనా రెండో విడతలో చాలామంది జర్నలిస్టులు మృత్యువాతపడ్డారు. దాదాపు 70 మంది జర్నలిస్టులు అకాల మరణం పొందారు. వారి కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఐదేళ్ల పాటు నెలకు రూ.3000 పెన్షన్ అందిస్తామన్నారు. అలాగే పదో తరగతిలోపు చదువుకుంటున్న వారిలో గరిష్టంగా ఇద్దరికి రూ.ఒక వేయి చొప్పున ఉపకార వేతనం అందిస్తున్నట్లు అల్లం నారాయణ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3600 కొవిడ్ సహాయ దరఖాస్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు.
కొవిడ్ తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు దరఖాస్తులను ‘కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్. ఇంటి నంబర్ 10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఏసీ గార్డ్స్, మాసబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్’ చిరునామాకు పంపాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలియజేశారు.