అత్యధిక వేతనాన్ని తీసుకోనున్న జెరోధా వ్యవస్థాపకులు!

by Harish |   ( Updated:2021-05-28 10:27:25.0  )
అత్యధిక వేతనాన్ని తీసుకోనున్న జెరోధా వ్యవస్థాపకులు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థ జెరోధా వ్యావస్థాపకులైన నితిన్ కామత్, నిఖిల్ కామత్‌లు అత్యధికంగా వేతనాన్ని అందుకోనున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ సోదరులిద్దరూ రూ. 100 కోట్ల భారీ వేతనాన్ని అందుకునట్టు తెలుస్తోంది. దీంతో పాటు లాభాల్లో వాటాను కూడా వీరు తీసుకోనున్నారు. స్టాక్ బ్రోకింగ్ స్టార్టప్ సంస్థ అయినా జెరోధా 2010, ఆగష్టులో ప్రారంభమైనప్పటి నుంచి వీరిద్దరూ సంస్థను క్రమంగా రూ. 1,000 కోట్ల ఆదాయాన్ని సాధించే కంపెనీగా చేర్చారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జెరోధా రూ. 442 కోట్ల లాభాలను సాధించడంలో వీరి కృషి ఉంది. జెరోధా కంపెనీ బొర్డు నితిన్ కామత్, నిఖిల్ కామత్‌లు ఏడాదికి రూ. 100 కోట్ల వేతనాన్ని తీసుకునేందుకు ప్రత్యేక తీర్మానం ద్వారా ఆమోదించింది. ఇదే సమయంలో నితిన్ కామత్ భార్య సీమా పాటిల్ ఇటీవలే కంపెనీ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. ఈ ముగ్గురికి నెలకు రూ. 4.17 కోట్ల చొప్పున ప్రాథమిక వేతనం లభిస్తుంది. మొత్తంగా అలవెన్సులు, ఇతర పరిహారాలతో కలిపి మొత్తంగా రూ. 300 కోట్ల వరకు వీరి కుటుంబం అందుకోనున్నారు.

భారత్‌లో ఇప్పటివరకూ ఇంత మొత్తం ఆదాయాన్ని అందుకునే వ్యవస్థాపుకులు, డైరెక్టర్లు ఉన్న కుటుంబం వీరిదే కావడం విశేషం. ఇప్పటివరకు అధిక ఆదాయాన్ని కలిగిన వ్యవస్థాపకుల జాబితాలో పేటీఎమ్‌కు చెందిన విజయ్ శేఖర్ శరం, ఇన్‌క్రెడ్స్‌కు చెందిన భూపిందర్ సింగ్, కార్‌ట్రేడ్‌కు చెందిన వినయ్ సంఘి, డ్రీమ్ 11కు చెందిన హర్ష్ జైన్, జోమాటో దీపిందర్ గోయెల్‌లు రూ. 3-6 కోట్ల మధ్య వేతనాన్ని తీసుకుంటున్నారు.

Advertisement

Next Story