- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సుకుమార్ సినిమాలో 'రొమాంటిక్' హీరోయిన్

దిశ, వెబ్‌డెస్క్: ‘కేతిక శర్మ’… ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చిస్తున్న పేరు. ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ఈ ఢిల్లీ బ్యూటీ .. ఆ సినిమాలో ఒక్క సాంగ్‌తోనే అటు కుర్రాళ్లు, ఇటు సినీ జనాలను తన మాయలో పడేసింది. తొలి సినిమా రిలీజ్ కాకుండానే మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా సుకుమార్ సినిమాలోనే ఛాన్స్ దక్కించుకుంది. సుకుమార్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన కాశీ విశాల్ తెరకెక్కించే చిత్రాన్ని .. సుకుమార్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నాగశౌర్య చేస్తుండగా.. హీరోయిన్‌గా కేతిక శర్మను ఎంచుకున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో నిర్మిస్తున్న సినిమాకు సుక్కు ఎలాంటి స్క్రిప్ట్ అందించాడు? కాశీ విశాల్ డైరెక్టర్‌గా తొలి సినిమాతోనే హిట్ కొడతాడా లేదా? అనే అంశాలు ఫిల్మ్ నగర్‌లో చర్చిస్తున్నారు. కాగా ఉప్పెనకు స్క్రిప్ట్ అందించి, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సుకుమార్… తన నెక్స్ట్ సినిమాకు కేతికనే ఎందుకు ఎంచుకున్నారు? అనేది టాలీవుడ్ టాపిక్ అయింది. ప్రస్తుతం సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నారు.
tags : Sukumar Writings, Ketika Sharma, Kaashi Vishal, Allu Arjun