- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి : రోహిత్ శర్మ

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 200పైగా మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకడు. తన జట్టుకు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన రోహిత్.. మరోసారి చాంపియన్‌గా నిలిపి ఆరోసారి విజేతగా నిలపాలని భావిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్ సమయంలో గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్.. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకున్నాడు. మరోసారి గాయాల పాలు కాకుండా తాను చాలా కష్టపడుతున్నట్లు రోహిత్ చెప్పాడు. ఇప్పటి వరకు నేను 200 ఐపీఎల్ మ్యాచ్‌లు గెలవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇదొక గొప్ప మైలురాయి. అయితే తాను మరో 200 మ్యాచ్‌లు కూడా ఆడతానని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. గాయం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పాడు. ప్రతి నిత్యం జట్టు సభ్యులందరం ఫిట్‌నెస్ సాధన చేస్తామని.. సమావేశాల్లో కూడా అందరం కలసి పాల్గొంటామని రోహిత్ చెప్పాడు. ఇలాంటి విషయాల వల్లే ముంబై ఇండియన్స్‌లో యూనిటి పెరుగుతున్నదని హిట్ మ్యాచ్ చెప్పుకొచ్చాడు.