- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న రోబోకు పెద్ద ఫీలింగ్స్
దిశ, వెబ్‌డెస్క్ :
రోబోలు, మనుషులు కలిసి జీవించే కాలం ఎంతో దూరంలో లేదని జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ అధ్యాపకులు అంటున్నారు. వారు తయారు చేసిన ఒక చిన్న రోబోకు నొప్పిని అనుభవించగల సెన్సార్లను అమర్చి, శారీరక బాధ ఎలా ఉంటుందో రోబోకి తెలిసేలా చేయగలిగారు. రజనీకాంత్ రోబో సినిమాలో లాగ రోబోలకు ఫీలింగ్స్ వచ్చేలా చేస్తే సమస్యలు రావా? అనే ప్రశ్నకు ప్రొఫెసర్ మినోరు అసాడా సమాధానం చెబుతూ… అలాంటి సమస్య రాకూడదనే ముందు రోబోలకు బాధ ఎలా ఉంటుందో తెలియజేసే పరిశోధనలు చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం వారు నొప్పి భావనను ఇనుమడింప చేసిన రోబో పేరు అఫెటో. దీని అర్థం ఇటాలియన్‌లో అభిమానం. కేవలం తల మాత్రమే ఉన్న ఈ చిన్న రోబో. మృదువైన స్పర్శకి, గట్టి స్పర్శకి తేడాను గుర్తించగలదు. మృదువుగా స్పృశించినపుడు నవ్వుతూ, గట్టిగా నొక్కితే ఏడవగలిగేలా ఇందులో సెన్సార్లు అమర్చారు. ఆ భావనకు తగినట్లుగానే ముఖంలో భావాలు కూడా పలికించగలదు. 2011లో తయారుచేసిన ఈ అఫెటో రోబో, 2018కి ఒక రూపాన్ని సంతరించుకుంది. బయోలజీ భావనల సాయంతో సింథటిక్ చర్మాన్ని, అది స్పందించడానికి కావాల్సిన నాడీ వ్యవస్థను కృత్రిమంగా తయారు చేశారు. ఇలాంటి రోబోలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి రోబోలు, మనుషులు కలిసి జీవించగల సమాజాన్ని సృష్టిస్తామని అసాడా అన్నారు. వయసు మీద పడుతున్న జపనీయులందరికీ ఈ రోబోలు సేవలు చేయడానికి ఉపయోగపడతాయని చెప్పారు.
Read also..