థీమ్ పార్కుల్లో రోబో డాల్ఫిన్స్?

by Harish |
థీమ్ పార్కుల్లో రోబో డాల్ఫిన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : విశ్వంలోని అత్యంత తెలివైన జంతువుల్లో డాల్ఫిన్ కూడా ఒకటి. అందుకే దానికి విభిన్న విన్యాసాలు నేర్పించి, థీమ్ పార్కుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఈ డాల్ఫిన్ల విన్యాసాల వల్ల బిలియన్ డాలర్లలో వ్యాపారం జరుగుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ వ్యాపారం వంకతో మూగజీవులను ఇన్ని రకాలుగా హింస పెట్టడం ఏమాత్రం సబబుకాదు. అందుకే ఈ సమస్యకు పరిష్కారం టెక్నాలజీ ద్వారా దొరికింది. అవును.. థీమ్ పార్కుల్లో నిజమైన డాల్ఫిన్ల స్థానంలో రోబో డాల్ఫిన్లను పెట్టి విన్యాసాలు చేయించేందుకు రంగం సిద్ధమవుతోంది. రోబోలు చేసే విన్యాసాలు చూస్తే మజా ఏం వస్తుందని దిగులు పడకండి. ఈ రోబో డాల్ఫిన్లు అచ్చంగా నిజమైన డాల్ఫిన్లను పోలి ఉంటాయి. ఎంతలా అంటే.. చూసేవారు అది రోబో డాల్ఫిన్ అని చెప్తే కూడా నమ్మలేనంత రియలిస్టిక్‌గా ఉంటాయి.

అమెరికాకు చెందిన ఎడ్జ్ ఇన్నోవేషన్స్ సంస్థలోని యానిమేట్రోనిక్, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగం వారు ఈ రోబో డాల్ఫిన్లను తయారు చేశారు. వీటి ధర 3 మిలియన్ల నుంచి 5 మిలియన్ల వరకు ఉంటుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించే ఈ డాల్ఫిన్లు నిజమైన డాల్ఫిన్ల మాదిరిగా ఈదగలవు, విన్యాసాలు చేయగలవు, మనుషులతో స్నేహం కూడా చేయగలవు. ఓ విద్యాసంబంధిత ప్రాజెక్టు‌లో భాగంగా రోబో డాల్ఫిన్‌ను తయారుచేసినపుడు తమకు ఈ ఆలోచన వచ్చిందని, దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తే ప్రస్తుతం బందీగా ఉన్న 3000ల వరకు డాల్ఫిన్లకు స్వేచ్ఛను ప్రసాదించే అవకాశం వస్తుందని ఎడ్జ్ ఇన్నోవేషన్స్ సీఈవో వాల్ట్ కాంటీ తెలిపారు.

Advertisement

Next Story