- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిషన్ భగీరథ ఎఫెక్ట్.. కుంగిన రహదారి
by Sridhar Babu |
X
దిశ, అశ్వారావుపేట : రాష్ట్రంలో ఓవైపు జోరుగా వర్షాలు కురుస్తున్న సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామ శివారులో సీతారామ కాలువ వంతెన వద్ద మంగళవారం రాత్రి మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీకేజ్ అయ్యింది. దీంతో దమ్మపేట- పాల్వంచ ప్రధాన రహదారి పూర్తిగా కుంగిపోయింది.
రోడ్డు కుంగిపోయిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన వారు మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేశారు. అక్కడకు చేరుకున్న ములకలపల్లి ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో రహదారి కుంగిన ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. దీంతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Advertisement
Next Story