- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెల్లవారకముందే .. తెల్లారిన బతుకులు
by Shyam |
X
దిశ, నల్లగొండ: వారంతా కారులో రాజమండ్రి సమీపంలోని కొత్తపల్లి నుంచి హైదరాబాద్కు రాత్రి బయలుదేరారు. మార్గ మధ్యలో మరో ముగ్గురిని ఎక్కించుకున్నారు. తెల్లవారుజామున వరకు వారి ప్రయాణం సాఫీగా సాగింది. ఇంతలోనే కారు డ్రైవర్ గమనించాడో లేదో ఆగివున్న లారీని ఢీకొట్టాడు. దీంతో రహదారి రక్తసిక్తమైంది. కారులో ప్రయాణిస్తున్న వారి బతుకులు తెల్లవారుజామునే తెల్లారాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. నల్లగొండ జిల్లాలోని చిట్యాల సమీపంలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిగా గీతలక్ష్మీ, శ్రీనివాస్, లక్ష్మీచంద్రగా గుర్తించారు. సమాచారం అందుకున్న నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement
Next Story