ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

by Shyam |
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
X

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు మల్లాపూర్ కు చెందిన వారిగా గుర్తించారు.

మల్లాపూర్‎కు చెందిన గుడికందుల శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి తన బావమరిది చంద్రమోహన్ దుబాయ్ వెళ్తున్నాడని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు జగిత్యాలకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వెంకటాపూర్ శివారులో ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లత, రమాదేవి, శృతి, చరణ్ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన చంద్రమోహన్ కు విషయం తెలియడంతో వెనక్కి తిరిగి వచ్చిన ఆయన మృతదేహాలను చూసి బోరున విలపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story